గన్నవరంలో ఘర్షణలు : వైసీపీ vs టీడీపీ

గన్నవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేశారు

Update: 2023-02-20 12:32 GMT

కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేశారు. టీడీపీ కార్యాలయాన్ని ధ్వసం చేయడమే కాకుండా అక్కడ ఉన్న ఐదు వాహనాలను తగులబెట్టారు. బీభత్సం సృష్టించారు. వంశీ ప్రోద్బలంతోనే తమ కార్యాలయంపై దాడులు చేయడం కాకుండా అక్కడ నిలిపి ఉంచిన వాహనాలను తగులబెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

వాహనాలు తగులబెట్టి...
టీడీపీ ఆఫీసుపై దాడి చేసి అద్దాలను, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. రెండు రోజుల నుంచి టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాకుండా ఘర్షణలకు దిగుతున్నారు. దీంతో ఈరోజు వంశీ వర్గీయులు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడంతో ఆయనపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వద్దకు టీడీపీ కార్యకర్తలు పెద్దయెత్తున చేరుకుంటున్నారు. వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. విజయవాడ - గన్నవరం జాతీయ రహదారిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ధర్నాకు దిగారు.


Tags:    

Similar News