ఏపీలో 124 కోట్లు మద్యాన్ని చప్పరించేశారు

నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం అమ్మకాలు జరిగాయి

Update: 2022-01-01 06:11 GMT

AP liquor policy 2024

ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాల్లో రికార్డు బ్రేక్ చేసింది. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబరు 31వ తేదీ రాత్రి ఒక్కరోజే 124.10 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇది రికార్డు స్థాయి అమ్మకాలని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆదాయం గణనీయంగా పెరిగిందన్న అంచనాలు విన్పిస్తున్నాయి.

ప్రీమియర్ బ్రాండ్లను....
మద్యం దుకాణాలు, బార్ల వేళలను పెంచడంతో పాటు మద్యం ప్రియులకు అన్ని ప్రీమియర్ బ్రాండ్లను అందుబాటులోకి తేవండంతో ఈ అమ్మకాలు జరిగాయి. గతంలో అన్ని బ్రాండ్లు ఏపీలో దొరికేవి కావు. అందుకే మద్యం అమ్మకాలు గత రెండేళ్లలో ఎప్పుడూ ఈ స్థాయిలో జరగేలేదు. అన్ని బ్రాండ్లను అందుబాటులో ఉంచడంతో మద్యం ప్రియులు 120 కోట్ల మద్యాన్ని చప్పరించేశారు.


Tags:    

Similar News