నేడు జగన్ చేతుల మీదుగా ఆక్సిజన్ ప్లాంట్లు

ఈసారి కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే సిద్ధమయింది.

Update: 2022-01-10 02:19 GMT

కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో ఏపీ ప్రభుత్వం అందుకు జాగ్రత్తలు తీసుకుంటుంది. కరోనా ను కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలు ప్రారంభించింది. కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ అందక ఎందరో మృత్యువాత పడ్డారు. ఆక్సిజన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇతర రాష్ట్రాల వైపు చూసింది. అయితే ఈసారి కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందుగానే సిద్ధమయింది.

13 జిల్లాల్లో...
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేసింది. ప్రధాన ఆసుపత్రుల ఆవరణలోనే ఆక్సిజన్ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆసుపత్రి సామర్థ్యాన్ని బట్టి ప్లాంట్లను నిర్మించారు. ఏపీలోని 13 జిల్లాల్లో మొత్తం 133 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. మరో 11 ఆక్సిజన్ ప్లాంట్ల పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. పూర్తయిన ఆక్సిజన్ ప్లాంట్లను జగన్ నేడు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.


Tags:    

Similar News