నాడు జగన్ కాదన్న నేతలకు నేడు చంద్రబాబు మంత్రి పదవి

గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ మంత్రి పదవులు ఇవ్వని వారు నేడు చంద్రబాబు కేబినెట్ లో చోటు సంపాదించుకున్నారు

Update: 2024-06-12 06:37 GMT

గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ మంత్రి పదవులు ఇవ్వని వారు నేడు చంద్రబాబు కేబినెట్ లో చోటు సంపాదించుకున్నారు. సీనియర్ నేతలయినా జగన్ నాడు పక్కన పెట్టడంతో అసంతృప్తితో బయటకు వెళ్లిపోయి టీడీపీలో చేరి మొన్నటి ఎన్నికలలో గెలిచి మంత్రి పదవులను దక్కించుకున్నారు. పార్టీ మారిన వారికి ఇద్దరికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు. సామాజికవర్గాల సమీకరణాలతో పాటు ప్రాంతాలు, జిల్లాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గంలో స్థానం కల్పించారు.

సీనియర్ నేతలకు...
నాడు వైసీపీ ప్రభుత్వంలో సీనియర్ నేతలుగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. ఆయనకు రెండుసార్లు విస్తరణ జరిగినా మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇక మరో సీనియర్ నేత కొలుసు పార్థసారధి కూడా మంత్రి పదవిని ఆశించి జగన్ ప్రభుత్వంలో భంగపడ్డారు. ఆయనకు రెండు దఫాలు జగన్ మొండి చేయి చూపించారు. దీంతో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరి నూజివీడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టారు. దీంతో జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవులు దక్కని ఇద్దరికీ చంద్రబాబు కేబినెట్ లో చోటు కల్పించారు.


Tags:    

Similar News