కొనసాగుతున్న గిరిప్రదిక్షిణ
వేలాది మంది భక్తులు గిరి ప్రదిక్షిణ కోసం ఆలయానికి చేరుకుని సింహగిరి నుంచి ప్రారంభించారు
సింహగిరి ప్రదక్షిణ ఉత్సవం కొనసాగుతుంది. వేలాది మంది భక్తులు గిరి ప్రదిక్షిణ కోసం ఆలయానికి చేరుకుని సింహగిరి నుంచి ప్రారంభించారు. నిన్న సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన గిరి ప్రదిక్షిణ నేటి సాయంత్రం వరకూ సాగనుంది. దాదాపు 32 కిలోమీటర్ల మేర సింహచలం కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేయ్యనున్నారు.
2600 మందితో...
ఏటా ఆషాఢమాసం పౌర్ణమి రోజున గిరిప్రదిక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు గిరి ప్రదిక్షిణలో పాల్గొన్నారు. దీంతో గిరి ప్రదిక్షిణ వద్ద 2600 మందితో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులుకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా వైద్య శిబిరాలు,అంబులెన్స్ లు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆహారం ఏర్పాటు చేశాయి.