Election Commission : దొంగ ఓట్లపై మూడు పార్టీలూ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన మూడు ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల కమిషన్ కు దొంగ ఓట్లపై ఫిర్యాదు చేశాయి

Update: 2023-12-14 12:41 GMT

central election commission

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. మూడు ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓట్లపై పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. తొలుత వైసీపీ కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలసి దొంగ ఓట్లపై ఫిర్యాదు చేసింది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి టీడీపీ నేతలు దాదాపు నాలుగు లక్షలకు పైగా దొంగ ఓట్లు చేర్చారని ఫిర్యాదు చేశారు.

అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ...
తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ నేతృత్వంలో బృందం ఈసీని కలిసింది. వైసీపీ పెద్దయెత్తున దొంగ ఓట్లను చేర్చిందని, దీనిపై ఉన్నతాధికారులతో విచారణ చేయించాలని కోరింది. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా జత చేస్తూ ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అధికార యంత్రాంగం కూడా వైసీపీకి మద్దతుగా నిలుస్తుందని ఆరోపించారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి నేతృత్వంలో సభ్యులు కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి దొంగ ఓట్లను తొలగించాలని కోరింది.


Tags:    

Similar News