కంభం ప్రాంతంలో పులి సంచారం
ప్రకాశం అర్ధవీడు మండలంలో పులి సంచారం ప్రజలను భయ కంపితులను చేస్తుంది.
ప్రకాశం అర్ధవీడు మండలంలో పులి సంచారం ప్రజలను భయ కంపితులను చేస్తుంది. నాగులవరం - మొహిద్దీన్ పురం ల మధ్య పులి సంచారం ఉంది. కంభం చెరువులోకి నీరు తాగేందుకు పులి వెళుతుండగా స్థానికులు చూసి అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
పాదముద్రలను సేకరించి...
దీంతో అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలను సేకరించారు. పులి సంచారం ఉన్నట్లు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఒంటరిగా ఇటు వైపు ఎవరూ రావద్దని, రాత్రి వేళ అసలు రావద్దని అటవీ శాఖ అధికారులు సమీప గ్రామ ప్రాంత ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు.