కాకినాడ జిల్లాలో పెద్దపులి కలకలం
పెద్దపులి సంచారంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు.. 120 మంది సిబ్బందిని రంగంలోకి దించారు. అటవీశాఖ అధికారి..
కాకినాడ : వన్యమృగాలు జనావాసాలు రావడం సర్వసాధారణమైపోయింది. తరచూ చిత్తూరు జిల్లా పరిధిలో వన్య మృగాలు జనావాసాల్లోకి వస్తుంటాయి. ఈసారి కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పెద్దపులి పశువులను చంపేస్తుండటంతో.. అనేక గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ప్రత్తిపాడు మండలంలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. పొదురుపాక, ఒమ్మంగి, ధర్మవరం, శరభవరం గ్రామాల్లో ఇప్పటివరకూ పెద్దపులి ఆరు గేదెలను చంపేసింది.
పెద్దపులి సంచారంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు.. 120 మంది సిబ్బందిని రంగంలోకి దించారు. అటవీశాఖ అధికారి శరవణన్ నేతృత్వంలో పులిని బంధించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. పులిని బంధించేందుకు ప్రత్తిపాడు మండలంలోని గ్రామాలకు భారీ సంఖ్యలో బోన్లను తరలిస్తున్నారు. రాత్రివేళల్లో తాగునీటికోసం గ్రామాలకు సమీపంలో ఉన్న కాల్వల వద్దకు వచ్చిన పులి.. గ్రామాల్లోని పశువులపై దాడి చేస్తున్నట్లు గుర్తించారు.