YSRCP : టీడీపీలో చేరేందుకు వైసీపీ ఎంపీ రెడీ.. ఈ నెల 22న
వైసీపీ ఎంపీ టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారయింది. ఈ నెల 22వ తేదీన టీడీపీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు;
YSRCP :వైసీపీ ఎంపీ టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారయింది. ఈ నెల 22వ తేదీన టీడీపీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈ నెల 22వ తేదీన టీడీపీలో చేరనున్నారు. ఆయన గత ఎన్నికల్లో వైసీపీ నుంచి నరసరావుపేట పార్లమెంటుకు పోటీ చేసి విజయం సాధించారు.
వైసీపీలో గెలిచి...
అయితే ఈసారి నరసరావుపేట సీటు కాకుండా గుంటూరు సీటు ఇస్తామని చెప్పడంతో లావు శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీపై అసంతృప్తితో పార్టీని వీడారు. వైసీపీకి రాజీనామా చేశారు. చంద్రబాబు ఆ మధ్య ఢిల్లీ వెళ్లినప్పుడు కలిసిన లావు శ్రీకృష్ణ దేవరాయలు తాను టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. చంద్రబాబు ఓకే చెప్పడంతో ఆయన చేరిక ఖాయమయింది. మరి నరసరావుపేట టీడీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తారా? లేదా మరొక స్థానం నుంచి ఆయన బరిలోకి దిగుతారా? అన్నది తెలియాల్సి ఉంది.