తిరుమల దర్శనానికి వెళ్లాలని అనుకుంటున్నారా.. ఇది తెలుసుకోండి..!
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా.. ఈరోజు దర్శనానికి
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా.. ఈరోజు దర్శనానికి భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 1 కంపార్టుమెంటులో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. నేడు టోకెన్ రహిత సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 85,258 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.28 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 25,451 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆగస్టు నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు.. వాటి వివరాలు ఇవే:
– ఆగస్టు 1న పౌర్ణమి గరుడ సేవ.
– ఆగస్టు 12న మతత్రయ ఏకాదశి.
– ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య దినోత్సవం, శ్రీ చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం.
– ఆగస్టు 21న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ.
– ఆగస్టు 22న కల్కి జయంతి.
– ఆగస్టు 25న తరిగొండ వెంగమాంబ వర్ధంతి, వరలక్ష్మీ వ్రతం.
– ఆగస్టు 26న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.
– ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు.
– ఆగస్టు 30న శ్రీ విఖనస మహాముని జయంతి. శ్రావణపౌర్ణమి. రాఖీ పండుగ.
– ఆగస్టు 31న హయగ్రీవ జయంతి. తిరుమల శ్రీవారు శ్రీ విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపు.