తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

Update: 2023-08-18 03:54 GMT

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం శ్రీవారిని 64,695 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 24,473మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.60కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారి దర్శనం కోసం శుక్రవారం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో ప్ర‌తి రోజు నిర్వ‌హించే అమ్మ‌వారి క‌ల్యాణోత్స‌వంలో భ‌క్తులు వ‌ర్చువ‌ల్‌గా పాల్గొనే అవ‌కాశం టీటీడీ క‌ల్పిస్తోంది. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వ‌ర్చువ‌ల్ విధానంలో భ‌క్తులు పాల్గొనేందుకు వీలుగా సోమ‌వారం నుండి శుక్ర‌వారం వ‌ర‌కు ఈ టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది . రూ.500/- చెల్లించి భక్తులు టికెట్‌ కొనుగోలు చేయవచ్చు. వ‌ర్చువ‌ల్ టికెట్లు పొందిన భ‌క్తులకు టికెట్టు పొందిన తేదీ నుండి 90 రోజులలోపు గృహస్తులను అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. వీరికి ఒక ఉత్త‌రియం, ర‌విక‌, ల‌డ్డూ, వ‌డ బ‌హుమానంగా అందిస్తారు. సుదూర ప్రాంతాల నుండి తిరుచానూరు వ‌చ్చి అమ్మ‌వారి క‌ల్యాణోత్స‌వంలో పాల్గొన లేని భక్తుల కోసం టీటీడీ వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం ప్ర‌వేశ‌పెట్టింది. భ‌క్తులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ కోరుతోంది.


Tags:    

Similar News