తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

Update: 2023-12-09 03:17 GMT

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 5 కంపార్టుమెంట్లలో వేచి చూస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనానికి 5 గంటలు, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3గంటల సమయం పడుతుంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించకుంటున్నారు. శుక్రవారం శ్రీవారిని 54,523 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 20,817 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.40 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

తిరుమల శ్రీవారి సేవలో మాజీ సీఎం, అర్.జే.డి నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం భాగమయ్యారు. లాలూ భార్య రబ్రిదేవి, తనయుడు బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో శ్రీవారిని లాలూ కుటుంబం దర్శించుకుంది. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కూతురు కేశఖండన చేయించుకుని మొక్కులు తీర్చుకుంది లాలూ కుటుంబం. లాలూ ప్రసాద్ వెంట తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, స్థానిక యాదవ సంఘం నేతలు ఉన్నారు.


Tags:    

Similar News