తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయంలో పడుతోంది.

Update: 2023-07-02 03:31 GMT

TTD

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయంలో పడుతోంది. భక్తులు అన్ని కంపార్ట్‌మెంట్లలో నిండిపోయి ఏటీసీ కౌంటర్‌ వరకు క్యూలైన్‌ కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే తిరుమల వెంకటేశ్వర స్వామిని 82,999 మంది భక్తులు దర్శించుకున్నారు. శనివారం 38,875 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండీ ఆదాయం 4.27 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. టీటీడీ స్థానికాలయాలతో పాటు ఉప ఆలయాల్లోనూ యూపీఐ(UPI) చెల్లింపులకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. సేవ టిక్కెట్లు, ప్రసాదాలు, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, డైరీలు, క్యాలెండర్లు కొనుగోలు చేసే భక్తుల సౌకర్యార్థం ఫోన్ పే, క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా యూపీఐ, డెబిట్ కార్డు ద్వారా చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఆయా ఆలయాల అధికారులతో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధిపనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. టీటీడీ వెబ్‌సైట్‌, ఎస్వీబీసీ, యాత్రికులు ఎక్కువగా సంచరించే రైల్వే స్టేషన్‌, బస్టాండు ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో టీటీడీ ఆలయాల గురించి తెలిసేలా సూచికబోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.


Tags:    

Similar News