Tirumala Update:తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. క్యూకాంప్లెక్స్‌లో
Tirumala Update:తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని అనుకుంటూ ఉన్నారా? ఇదే మంచి సమయం. తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. క్యూకాంప్లెక్స్‌లో 4 పార్ట్‌మెంట్లు నిండాయి. మంగళవారం 64,552 మంది స్వామివారిని దర్శించుకోగా 19,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.91 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం పూర్తవుతూ ఉందని అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దర్శనం, సేవా టికెట్లు పొందిన భక్తులకు వసతి అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీవారిపై ఉన్న భక్తి వల్ల టికెట్లు త్వరగా అయిపోతున్నాయన్నారు. అప్పటికి తాము టికెట్ల బుకింగ్‌ను క్లౌడ్‌లో ఉంచుతున్నామని తెలిపారు. వ్యవస్థ చాలా పారదర్శకంగా, పటిష్టంగా, అద్బుతంగా పనిచేస్తూ ఉందని వివరించారు.