తిరుమల దర్శనానికి ఎంత సమయం పడుతోందో తెలుసుకోండి

తిరుమలలో గురువారం నాడు భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు

Update: 2023-07-20 02:40 GMT

TTD

తిరుమలలో గురువారం నాడు భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. బుధవారం 74,024 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.96 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 32688 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

జూన్‌ నెలలో సుమారు 23 లక్షల మంది భక్తులు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం 116.14 కోట్లు వచ్చిందని టీటీడీ ఈవో వెల్లడించారు. 1.06 కోట్ల లడ్డూలను విక్రయించామని వివరించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు 10.8లక్షల మంది శ్రీవారికి తలనీలాల్ని మొక్కుగా చెల్లించుకున్నట్లుగా టీటీడీ వర్గాలు తెలిపాయి.


Tags:    

Similar News