తిరుమలకు వెళ్లాలని అనుకుంటున్నారా.. ఇదే మంచి సమయం
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటే తక్కువ సమయంలోనే దర్శనం అయిపోయే అవకాశం ఉంది. తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటే తక్కువ సమయంలోనే దర్శనం అయిపోయే అవకాశం ఉంది. తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 64,003 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.06 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 24,659 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఎస్వీ ఓరియంటల్ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఓరియంటల్ డిగ్రీ కళాశాలలో ప్రీ డిగ్రీ (ఇంటర్), డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రెండేళ్ల ప్రీ డిగ్రీలో సంస్కృతం, తెలుగు, హిందీ కోర్సులకు 18 ఏళ్ల లోపు వయసు కలిగి ఎస్ఎస్‌సి లేదా తత్సమాన విద్యార్హత కలిగిన విద్యార్థులు అర్హులు. మూడేళ్ల సంస్కృతం, తెలుగు, హిందీ కోర్సులకు 21 సంవత్సరాల లోపు వయసు కలిగి ప్రీ డిగ్రీ, ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలి. తిరుపతి కె.టి. రోడ్డులోని కళాశాల కార్యాలయంలో రూ.25/- చెల్లించి దరఖాస్తులు పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31వ తేదీలోపు సమర్పించాలి. ప్రవేశం లభించిన విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా ఉచితంగా హాస్టల్ సదుపాయం కల్పిస్తారు. ఇతర వివరాలకు 0877 – 2264604, 0877 – 2263974 నంబర్లను సంప్రదించగలరు.