తిరుమల దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం

Update: 2023-08-03 07:41 GMT

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 9 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 69,365 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం వేంకటేశ్వరుడి హుండీ ఆదాయం 3.05 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. స్వామివారికి 26,006 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీ‌వాణి ట్ర‌స్టుపై కొంత‌మంది వ్య‌క్తులు ప‌నిగ‌ట్టుకుని ఆరోప‌ణ‌లు చేస్తున్న నేప‌థ్యంలో ఈ విష‌యంలో వాస్త‌వాల‌ను తెలుసుకోవ‌డానికి ఏర్పాటైన తిరుప‌తి ప్రెస్‌క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలోని నిజ‌నిర్ధార‌ణ క‌మిటీకి టీటీడీ అనుమ‌తించింది. శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అనేక పురాత‌న ఆల‌యాల జీర్ణోద్ధ‌ర‌ణ‌తోపాటు ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మ‌త్స్య‌కార గ్రామాల్లో ఆల‌యాల నిర్మాణానికి టీటీడీ నిధులు అందిస్తోంది. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లోని ఆల‌యాల్లో ధూప‌దీప నైవేద్యాల‌కు ఆర్థిక‌సాయం కూడా చేస్తోంది. టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి శ్రీ‌వాణి ట్ర‌స్టుపై ఇటీవ‌ల శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేశారు. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు వ్య‌క్తులు శ్రీ‌వాణి ట్ర‌స్టు నిర్వ‌హ‌ణ‌పై ఆరోప‌ణ‌లు చేస్తుండ‌డంతో ఈ విష‌యంలో వాస్త‌వాలు వెలుగులోకి తీసుకురావ‌డానికి తిరుప‌తి ప్రెస్‌క్ల‌బ్ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీగా ఏర్పాటై ముందుకు వ‌చ్చింది. వాస్త‌వాలు తెలుసుకోవ‌డానికి స‌ద‌రు క‌మిటీకి టీటీడీ అనుమ‌తించింది.


Tags:    

Similar News