తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం నాడు శ్రీవారి సర్వదర్శనానికి 19 కంపార్టుమెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం 78,030 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అదే కాకుండా శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 35,860 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. సోమవారం నాడు 79,974 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం నాడు శ్రీవారికి రూ.3.77 కోట్ల విలువైన కానుకలను చెల్లిచారు భక్తులు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని టీటీడీ తెలిపింది. సమ్మర్ వేడి తగలకుండా జాగ్రత్తలు తీసుకున్నామంది. క్యూలైన్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తుల కొరకు పాలు, మజ్జిగ, కిచిడి, ఉప్మా, సాంబార్ రైస్, పెరుగన్నం, సుండల్, మంచి నీటిని టీటీడీ అందిస్తోంది.