Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ... గోవింద నామస్మరణలతో

తిరుమలలో మళ్లీ రద్దీ పెరిగింది. నిన్న కొంత తగ్గినట్లు కనిపించినా మళ్లీ గురువారం రద్దీ పెరిగింది.

Update: 2024-06-27 03:17 GMT

తిరుమలలో మళ్లీ రద్దీ పెరిగింది. నిన్న కొంత తగ్గినట్లు కనిపించినా మళ్లీ గురువారం రద్దీ పెరిగింది. ఇక శుక్ర, శని, ఆదివారాలు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. వీకెండ్ లో ఎలాగూ తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తులు రద్దీ అధికంగానే ఉంటుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఈరోజు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

పద్దెనిమిది గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తతిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదాలను ఉచితంగా శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 77,332 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 30,540 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.38 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News