Tirumala : తిరుమలలో నేడు ఫుల్లు రద్దీ... దర్శనం చేసుకోవాలంటే?

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

Update: 2024-12-13 03:51 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. మాడవీధుల్లో భక్తుల సందడి కనపడుతుంది. గోవిందనామ స్మరణలతో తిరుమల వీధులు మారుమోగుతున్నాయి. భారీవర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో వారు ఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వర్షంలో తడుస్తూనే భక్తులు స్వామి వారి దర్శనం చేసుకుని స్వామి వారి ప్రసాదాలను స్వీకరిస్తున్నారు. ముందుగా బుక్ చేసుకున్న వారు టిక్కెట్లను కొనుగోలు చేసిన వారు తిరుమలకు చేరుకోవడంతో పాటు రేపుశని వారం కూడా కావడంతో భక్తులు అధికంగానే ఉంటారని అధికారులు వేసుకున్న అంచనాలు నిజమయ్యాయి. జోరున వానలోనూభక్తులు తిరుమలకు చేరుకోవడంతో తిరుమల వీధులన్నీ కిక్కిరిసి పోయి ఉన్నాయి. తలనీలాలను సమర్పించే ప్రాంతాల్లోనూ, కోనేరు వద్ద కూడా భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. తిరుమల ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా ఎక్కువ రద్దీ కనిపిస్తుంది. దీంతో పాటు అన్నప్రసాదాల వద్ద కూడా భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని ప్రసాదాలను స్వీకరించేందుకు క్యూ లైన్ లో నిలబడి ఉన్నారు.

21 కంపార్ట్ మెంట్లలో...
తిరుమలకు అధికసంఖ్యలో భక్తులు చేరుకోవడంతో అధికారులు కూడా అందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేశారు. శుక్ర, శని, ఆదివారాలు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్న కారణంతో ముందుగానే చర్యలు తీసుకుని దర్శనం త్వరగా పూర్తయ్యేందుకు అన్ని విధాలుగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని 21 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయ టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 24 గంటలసమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారిదర్శనం మూడు గంటలకు పైగానే సమయం పడుతుందని అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 61,178 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.85 కోట్ల రూపాయల ఆదాయంవచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News