Tirumala : ఇంత రద్దీనా.. ఏడుకొండలవాడి దర్శనానికి ఇంత సమయమా?

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈరోజు బుధవారం అయినా భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు.

Update: 2024-11-06 03:05 GMT

tirumala darshan

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈరోజు బుధవారం అయినా భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. కార్తీక మాసం కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ నెల మొత్తం రష్ ఇలాగే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే రద్దీకి తగినట్లుగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారి దర్శనం సులువుగా, వెంటనే పూర్తి అయ్యేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. సర్వీస్ లైన్ లను ఏర్పాటు చేసి అందులో పంపుతున్నారు. బయట వరకూ క్యూ లైన్ నిండినప్పుడు భక్తులు ఎక్కువ సమయం వేచి చూడకుండా ఈ సర్వీస్ లైన్ ద్వారా వెళితే తక్కువ సమయంలో శ్రీవారిని దర్శించుకునే వీలుందని అధికారులు ఈ రకమైన చర్యలు చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో దర్శన సమయం ఎక్కువగానే ఉంటుంది. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదాలను, మజ్జిగను అందచేస్తున్నారు. వసతిగృహాల కోసం కూడా క్యూ లైన్ పెద్దదిగా ఉండటంతో ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తుందంటున్నారు భక్తులు.

పదిహేడు కంపార్ట్‌మెంట్లలో...
తిరుమలకు గత కొద్ది రోజుల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. శని, ఆదివారాలు మాత్రమే కాకుండా వారంలో అన్ని రోజులూ ఎక్కువ మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తుండటంతో అందుకు తగిన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్నారు. ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ దర్శన సమయం మాత్రం తగ్గడం లేదు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదిహేడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ టిక్కెట్లు ఉన్న భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటలకు పైగానే సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 68,146 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,667 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News