Tirumala : తిరుమలలో తగ్గని భక్తులు రద్దీ.. దర్శన సమయం ఎంతంటే?

తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. గురువారం కూడా భక్తుల రద్దీ అధికంగానే ఉంది.;

Update: 2024-11-07 03:11 GMT
darshan time in tirumala today,  crowd in tirumala today, tirumala is crowded with devotees today, tirumala  darshan, How much time taking for darshan in Tirumala today?

tirumala darshan

  • whatsapp icon

తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. గురువారం కూడా భక్తుల రద్దీ అధికంగానే ఉంది. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కార్తీకమాసం ప్రారంభం నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులు వీలయినంత త్వరగా శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఎక్కువ మంది భక్తులు రావడంతో కొంత ఆలస్యంగానే శ్రీవారి దర్శనం లభిస్తుంది. భక్తులు కంపార్ట్‌మెంట్లలో వెయిట్ చేయాల్సి వస్తుంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటయిన తర్వత తిరుమలలో అనేక సంస్కరణలు చేపట్టారు. సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు అనువైన పద్ధతులను అవలంబిస్తున్నారు. సర్వీస్ లైన్ లను కూడా ఏర్పాటు చేశారు. ఇంత చేసినా కార్తీక మాసం ఎఫెక్ట్‌తో మాత్రం తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం విషయంలో కొంత ఆలస్యమవుతూనే ఉంది. పెరుగుతున్న భక్తుల సంఖ్యను బట్టి లడ్డూ తయారీల సంఖ్యను కూడా పెంచినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అన్నప్రసాదం సత్రం వద్ద కూడా భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదాలను అందచేస్తున్నారు.

పదిహేడు కంపార్ట్‌మెంట్లలో...
మరో మూడు నెలల పాటు తిరుమలలో రద్దీ ఇలాగే ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పదిహేడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం తొమ్మిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 66,163 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,229 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.86 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. మరికొద్ది రోజుల పాటు ఇదేరకమైన రద్దీ ఉండే అవకాశముంది.


Tags:    

Similar News