Tirumala : తిరుమలలో నేడు రష్ ఎలా ఉందంటే?

తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో పాటు పరీక్ష ఫలితాలు విడుదల కావడం కారణంగా చెబుతున్నారు

Update: 2024-04-26 03:14 GMT

తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో పాటు పరీక్ష ఫలితాలు విడుదల కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి ఎక్కువ సమయమే పడుతుంది. వసతి గృహాలు దొరకడం కూడా కొంత కష్టంగానే ఉంది. వసతి గృహాల కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

కంపార్ట్‌మెంట్లలో...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఇరవై కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వద్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 61,492 మంది భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.72 కోట్ల వచ్చిందని తెలిపారు. రేపు, ఎల్లుండి కూడా తిరుమలలో రష్ అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Tags:    

Similar News