టీటీడీ కీలక నిర్ణయం.. ప్రత్యేక దర్శనాలు రద్దు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్దమవుతుంది. ఈ సందర్భంగా తిరుమల, తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2022-07-28 07:56 GMT

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్దమవుతుంది. ఈ సందర్భంగా తిరుమల, తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. కేవలం సర్వదర్శనానికే అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు.

సెప్టంబరు 27 నుంచి....
సెప్టంబరు 27వ తేదీ నుంచి అక్టోబరు 5వ తేదీ వరకూ తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 27 నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది ఎవరికీ బ్రహ్మోత్సవాల సందర్భంగా సెలవులను కూడా రద్దు చేశారు. సెప్టంబరు 27న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలను బహుకరించనున్నారు.


Tags:    

Similar News