తిరుమలలో కాస్త తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. ప్రస్తుతం 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి

Update: 2023-06-27 01:56 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. ప్రస్తుతం 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతూ ఉంది. సోమవారం శ్రీవారిని 73,156 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 28,175 మంది భక్తులు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.4.29 కోట్లని టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుమలలో జులై నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు టీటీడీ పీఆర్ఓ విభాగం ఉత్సవాల వివరాలను ప్రకటించింది. జులై 1న శని త్రయోదశి, 3న ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూజ, గురుపూర్ణిమ, 13న సర్వఏకాదశి, 15న శని త్రయోదశి, 17న శ్రీవారి ఆణివార ఆస్థానం, 22న ఆండాళ్ తిరువాడిపురం శాత్తు మొర, శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేయడం, 30న నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం ఉంటాయని పేర్కొంది.


Tags:    

Similar News