తిరుమలలో పెరిగిన రద్దీ

Update: 2023-06-25 02:33 GMT

తిరుమలలో భక్తుల రద్దీ మరోసారి పెరిగింది. తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 83,889 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారికి హుండీ ఆదాయం 3.10 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 40,495 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదుల కోటాను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈనెల 26న ఉదయం 10 గంటలకు టికెట్లు, గదుల కోటాను ఆన్‌లైన్ లో విడుదల చేయనున్నారు. తిరుమల, తిరుపతి, తలకోన ప్రాంతాల్లోని గదులను భక్తులు బుక్ చేసుకోవచ్చని సూచించారు. భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో గదులను బుక్ చేసుకోవచ్చని తెలిపారు.


Tags:    

Similar News