తిరుమలలో భక్తుల రద్దీ.. నేడు దర్శన టికెట్లు, గదుల కోటా విడుదల
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో సోమవారం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు 9 కంపార్టుమెంట్లలో
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో సోమవారం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు 9 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వచ్చిన నేపథ్యంలో స్వామి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 12 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం శ్రీవారిని 87,407 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,713 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలతో ఆదివారం శ్రీవారి హుండీకి ఆదాయం రూ.4.47 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదుల కోటాను విడుదల చేస్తోంది. ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించిన గదుల కోటాను సోమవారం ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతి, తలకోన ప్రాంతాల్లోని గదులను భక్తులు బుక్ చేసుకోవచ్చని టీటీడీ వెల్లడించింది. ఇందు కోసం భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్..టీటీడీ యాప్ లో గదులను బుక్ చేసుకోవచ్చని టీటీడీ సూచించింది.