Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు కొద్దిసేపటి క్రితం ఆన్ లైన్ లో విడుదలయ్యాయి.

Update: 2024-06-24 05:54 GMT

తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు కొద్దిసేపటి క్రితం ఆన్ లైన్ లో విడుదలయ్యాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ లైన్ లో ఉంచింది. సెప్టంబరు మాసంలో తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలనుకున్న భక్తులు ముందుగానే బుక్ చేసుకోవచ్చు.

ఆన్ లైన్ లో టిక్కెట్లను...
ప్రత్యేక దర్వనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ttdevasthanams.ap.gov.in వైబ్ సైట్ లో అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సెప్టెంబర్ నెల వసతి గదుల కోటాను కూడా టీటీడీ విడుదల చేయనుంది. దీని ద్వారా తిరుపతి, తిరుమలలో గదులు బుక్ చేసుకునే అవకాశముంటుంది.


Tags:    

Similar News