ఆ రెండు రోజులు తిరుమల ఆలయం మూసి వేత
అక్టోబరు 25, నవంబర్ 8వ తేదీల్లో తిరుమల ఆలయం మూసి వేత
అక్టోబరు 25, నవంబర్ 8వ తేదీల్లో సూర్య, చంద్రగ్రహణాల కారణంగా తిరుమలలోని వేంకటేశ్వరుని ఆలయాన్ని దాదాపు 12 గంటల పాటు మూసివేయనున్నారు. తిరుమలగుడితో పాటు, దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న దాదాపు 60 ఆలయాలు అక్టోబర్ 25న "సూర్యగ్రహణం" కారణంగా మూసివేయబడతాయి. నవంబర్ 8వ తేదీన "చంద్రగ్రహణం" కారణంగా శ్రీవారి ఆలయం మూతపడనుంది. శుద్ధి, పుణ్యాహవచనం వంటి పూజల అనంతరం ఆలయంలో సాధారణ పూజలు పునఃప్రారంభమవుతాయని టీటీడీ తెలిపింది.
అక్టోబర్ 25, నవంబర్ 8 తేదీలలో తిరుమల ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్-లింక్డ్ విఐపి బ్రేక్ దర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇతర అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు నిలిపివేయబడతాయని టీటీడీ వెల్లడించింది. అయితే, ఈ రెండు రోజులూ నిర్దేశిత గంటలలో సాధారణ భక్తులను సర్వదర్శనానికి అనుమతులు ఉంటాయని అధికారులు తెలిపారు.