తిరుమల దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
వారణాశి లోని శివాల ప్రాంతం సమీపంలోని చాట్ సింగ్ ఫోర్ట్ వద్ద జూలై 28 నుంచి ఆగష్టు 3వ తేదీ వరకు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం 74,268 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.32 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 26,817 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
వారణాశి లోని శివాల ప్రాంతం సమీపంలోని చాట్ సింగ్ ఫోర్ట్ వద్ద జూలై 28 నుంచి ఆగష్టు 3వ తేదీ వరకు ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం కార్యక్రమం నిర్వహించనున్నారు. లోకక్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్య వృద్ధి కొరకు అలాగే, అతివృష్టి, అనావృష్టి నుంచి ప్రపంచాన్ని కాపాడాలని ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా హోమ గుండాలు ఏర్పాటు చేసి ఏడు రోజుల పాటు నాలుగు వేదాల్లోని అన్ని మంత్రాలను పఠించి యజ్ఞేశ్వరునికి సమర్పణ చేస్తారు. ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి డాక్టర్ విభీషణ శర్మ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.