తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
శుక్రవారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు టోకెన్ రహిత సర్వదర్శనం
శుక్రవారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 59,898 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.44 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 26,936 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
నేడు డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆగస్టు 4వ తేదీ శుక్రవారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.