టీటీడీ కీలక నిర్ణయం.. వీఐపీలకు షాక్

తిరుమల తిరుపతి దేవస్థానం కీలకం నిర్ణయం తీసుకుంది. వీఐపీలు ఇక ఐదు గంటలకు దర్శనం చేసుకునే వీలులేదు

Update: 2022-10-28 05:41 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం కీలకం నిర్ణయం తీసుకుంది. వీఐపీలు ఇక ఐదు గంటలకు దర్శనం చేసుకునే వీలులేదు. డిసెంబరు ఒకటో తేదీ నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ఉదయం8.30 గంటలకు ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. ఐదు గంటలకు బదులు ఉదయం 8.30 గంటల నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం ప్రారంభమవుతుందన్నారు. రాత్రి నుంచి సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.

నవంబరు నెల నుంచి...
నవంబరు నెల నుంచి సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం ఐదు గంటల నుంచే ప్రారంభిస్తుండటంతో రాత్రి వేళ క్యూ లైన్ లో వేచి ఉండే సర్వదర్శనం క్యూ లైన్ లో ఉండే భక్తులు ఇబ్బంది పడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రాత్రి వేచి ఉన్న భక్తులు ఉదయం 8.30 గంటలలోపు దర్శనం అయ్యేలా చూస్తామని అన్నారు. కల్యాణోత్సవం టిక్కెట్లు తీసుకున్న వారికి ఇబ్బంది లేకుండా ఈ చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయించామని చెప్పారు. తిరుమలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైకులపై రాయితీలు ఇస్తామని వివరించారు.


Tags:    

Similar News