టీటీడీ ఛైర్మన్ గా వైవీ అవుట్?
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. వైవీ సుబ్బారెడ్డిని ఛైర్మన్ గా తప్పించనున్నారు
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. సంక్రాంతి తర్వాత కొత్త పాలకమండలిని ప్రభుత్వం నియమించే అవకాశముంది. 2019 లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వైవీ సుబ్బారెడ్డిని పూర్తి కాలం వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నారు.
సంక్రాంతి తర్వాత...
ఈ నేపథ్యంలోనే వైవీసుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పించాలని జగన్ ఆలచిస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఆయన స్థానంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని నియమించే అవకాశముందని తెలిసింది. వచ్చే ఎన్నికలలో మళ్లీ గెలిచేందుకు జగన్ వరసగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్ గా తప్పించి ఉత్తరాంధ్ర జిల్లాల పూర్తి బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. సంక్రాంతి తర్వాత కొత్త పాలకమండలిని నియమించే అవకాశాలున్నాయి.