తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?

మంగళవారం నాడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు

Update: 2023-08-08 02:42 GMT

మంగళవారం నాడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. సోమవారం స్వామివారిని 69,733 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.37 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 28,614 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షునిగా తాను ప‌నిచేసిన నాలుగేళ్ల‌లో ఎక్కువ‌మంది సామాన్య భ‌క్తుల‌కు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 టికెట్లు ర‌ద్దు చేయ‌డం, సామాన్యుల‌కు స్వామివారి తొలి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు విఐపి బ్రేక్ స‌మ‌యాన్ని మార్చుతూ తీసుకున్న నిర్ణ‌యాలు అత్యంత సంతృప్తినిచ్చాయ‌ని టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వ‌చ్చే సామాన్య భ‌క్తులకు వ‌స‌తి, ఇత‌ర స‌దుపాయాలు మెరుగుప‌ర‌చ‌డం కోసం అనేక నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని, ఈ రెండు నిర్ణ‌యాలు మాత్రం ఎప్ప‌టికీ మ‌రువ‌లేనివ‌ని తెలిపారు. నాలుగేళ్ల‌పాటు ఛైర్మ‌న్‌గా ప‌నిచేసే అదృష్టం ప్ర‌సాదించిన శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి, త‌నకు అవ‌కాశం ఇచ్చిన శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి, త‌న వెన్నంటి ఉన్న ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, వీర‌బ్ర‌హ్మం, ఇత‌ర అధికారులు, సిబ్బందికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. నూత‌న ఛైర్మ‌న్‌గా నియ‌మితులైన శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి అనుభ‌వం టీటీడీ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని అన్నారు. టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం సోమ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అధికారులు ఛైర్మ‌న్ నాలుగేళ్ల ప‌ద‌వీకాలంలో తీసుకున్న ముఖ్య‌మైన నిర్ణ‌యాలకు సంబంధించిన ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. అనంత‌రం శ్రీ వైవి.సుబ్బారెడ్డి మీడియాకు బోర్డు నిర్ణ‌యాల‌ను వెల్ల‌డించారు.


Tags:    

Similar News