తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ కాస్త పెరిగింది. నేడు శ్రీవారి టోకెన్ రహిత

Update: 2023-08-22 02:40 GMT

తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ కాస్త పెరిగింది. నేడు శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 69,909 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.37 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 29,327 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం రాత్రి తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు తనకు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ గరుడ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది. శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని శుక్ల పక్షం ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా, బలశాలిగా ఉండేందుకు ఈ సందర్భంగా ”గరుడ పంచమి” పూజ చేస్తారు.


Tags:    

Similar News