టీటీడీ ఛైర్మన్ పదవి ఆయనకే

2006-2008 మధ్య కాలంలో టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు భూమన కరుణాకర్ రెడ్డి

Update: 2023-08-05 11:20 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ గా తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్థానంలో ఆయన టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించబోతున్నారు. సుబ్బారెడ్డి పదవీకాలం ఆగస్టు 8న ముగియనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కొత్త ఛైర్మన్ ను ఎంపిక చేశారు. ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలను స్వీకరించడం ఇది రెండోసారి. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో 2006 నుంచి 2008 మధ్య ఆయన ఛైర్మన్ గా పని చేశారు. ప్రస్తుతం టీటీడీలో ఛైర్మన్ సహా 35 మంది పాలకమండలి సభ్యులు ఉన్నారు.

2006-2008 మధ్య కాలంలో టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు భూమన కరుణాకర్ రెడ్డి. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా, టీటీడీ మెంబర్‌గా ఉన్నారు. అప్పుడు వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ .. ఇప్పుడు జగన్‌ హయాంలోనూ భూమన టీటీడీ పగ్గాలు చేపట్టడం విశేషం. రెండేళ్లపాటు ఈ పదవిలో ఉండనున్నారు.




 


Tags:    

Similar News