తిరుపతిలో భారీ వర్షం... నీటిలో నానుతున్న నగరం

తిరుపతిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అనేక కాలనీలు నీట మునిగాయి.

Update: 2021-11-18 12:21 GMT

తిరుపతిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అనేక కాలనీలు నీట మునిగాయి. తిరుపతి నగరంలోని మధురానగర్ లో ఐదు అడుగుల మేర నిలిచిపోయింది. ప్రధాన వీధుల్లో మూడు అడుగుల నీరు ప్రవహిస్తుంది. ఎక్కడిక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో ప్రమాదకరమైన పరిస్థితులు కన్పిస్తున్నాయి. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అర్బన్ ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు.

రెండు నడక దారులను....
మరోవైపు ఈరోజు తెల్లవారు జాము నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో తిరుమలకు వెళ్లే రెండు నడకదారులను మూసివేశారు. కపిలతీర్థంలోకి కూడా వరద నీరు ప్రవేశించడంతో ఆలయంలోకి ప్రవేశాన్ని నిషేధించారు. తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా జలప్రళయం విరుచుకు పడిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News