Ys Jagan : నేడు జగన్ పిటీషన్ పై సీబీఐ కోర్టులో విచారణ

నేడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది.;

Update: 2024-05-09 04:29 GMT
ys jagan,  chief minister, development programs, vijayawada
  • whatsapp icon

నేడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టును జగన్ అనుమతి కోరుతూ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ తరుపున న్యాయవాదులు నిన్న సీీబీఐ కోర్టులో పిటీషన్ వేశారు.

విదేశాలకు వెళ్లేందుకు...
ఈ నెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసన తర్వాత 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు వైఎస్ జగన్ అనుమతి కోరారు. దేశం విడిచి వెళ్లొద్దన్న బెయిల్ షరతులను సడలించాలని న్యాయస్థానాన్ని జగన్ ఆశ్రయించారు. దీనిపై కౌంటరు వేయాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. నేడు దీనిపై విచారణ జరగనుంది.


Tags:    

Similar News