Gold Price Today : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు... అదే బాటలో వెండి కూడా

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గాయి

Update: 2024-07-01 03:15 GMT

అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, తగ్గిన దిగుమతులు ఇలా... అనేక కారణాలతో బంగారం, వెండి ధరల్లో నిత్యం అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. బంగారం అనేది ఎప్పుడూ విలువైన వస్తువే. దానిని కొనుగోలు చేయడానికి అందరూ ఇష్టపడుతుంటారు. అందుకే కొనుగోళ్లు ఏరోజూ తగ్గవు. ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారాన్ని కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. దీంతో బంగారం ధరలు పెరిగినప్పుడు ఎక్కువగా, తగ్గినప్పుడు తక్కువగా ధరలు ఉంటాయి. అయినా సరే కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.

దక్షిణ భారతంలోనే...
దేశంలోనే బంగారానికి ఒక ప్రత్యేకత ఉంది. భారత దేశంలోనే ఎక్కువగా కొనుగోళ్లు ఉంటుంది. విరివిగా బంగారాన్ని, వెండిని వినియోగించేది కూడా భారతీయులు మాత్రమే. భారత దేశంలో ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో బంగారం ఆభరణాలను కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. ఇప్పటికీ దానినే ఇక్కడ కొనసాగిస్తున్నారు. అందుకే దక్షిణ భారత దేశంలో ఉన్న జ్యుయలరీ దుకాణాలు దేశంలో మరెక్కడా కనిపించవు. మహిళలు అత్యంత ఇష్టపడే బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడమే కాకుంటే, తమ ఇంట్లో ఉంటే శుభకరంగా భావిస్తారు. ఇక పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమయితే కొనుగోళ్లు మరింత ఊపందుకోనున్నాయి.
ధరలు తగ్గిన తర్వాత...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది, ఆగస్టు నెల నుంచి అసలు సీజన్ ప్రారంభం కానుంది. అంతకు ముందే బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడం కొంత ఊరటనిచ్చే అంశమే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,240 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,270 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 94,400 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News