Gold Price Today : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా మార్పు కనిపించింది.

Update: 2024-11-25 04:09 GMT

పసిడి ధరలు ఎప్పుడూ ఊరిస్తూనే ఉంటాయి. తగ్గితే తక్కువ మొత్తంలోనూ పెరిగితే భారీగా పెరుగుతూ వినియోగదారులను ఆకట్టుకునేలా వ్యవహరిస్తుంటాయి. బంగారం ధరలు గత కొద్ది రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. వెండి ధరలు కూడా అదే తరహాలో పరుగును అందుకున్నాయి. బంగారం, వెండి అంటే స్టేటస్ సింబల్ గా మారడంతో వాటిని కొనుగోలు చేయడానికి అనేక మంది తమ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రయత్నిస్తుంటారు. కానీ సంప్రదాయాలు, ఆచారాలను కూడాఅనుసరించి విధిగా బంగారం, వెండి కొనుగోలు చేయాల్సి రావడంతో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.

ప్లాటినం కంటే...
గతంలో బంగారం ధరలు సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేవి. కానీ రాను రాను బంగారం అనేది చాలా కాస్ట్లీ గా మారిపోయింది. ఒకప్పుడు తులం బంగారం కొనుగోలు చేసేకంటే ప్లాటినం ఆభరణాలను కొనుగోలు చేయడం స్టేటస్ గా భావిస్తారు. కానీ ఇప్పుడు ప్లాటినం ధరలను మించి బంగారం ధరలు పరుగులు తీస్తుంది. అయినా సరే బంగారానికి, వెండికి మాత్రం డిమాండ్ తగ్గడం లేదని, రానున్న కాలంలో వీటి ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ధరలు పెరుగుదలతో సంబంధం లేకుండా పెట్టుబడి కోసం కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో కొనుగోళ్లపై పెద్దగా ప్రభావం చూపడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
స్వల్పంగా తగ్గి...
బంగారం,వెండి ధరలు మరింత ప్రియమవుతాయని భావించి ముందుగానే కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా కనపడుతుంది. రానున్నకాలంలో అస్సలు కొనుగోలు చేయలేమన్నభావన ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా మార్పు కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,990 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,630 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 91,900 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News