ఈరోజు చంద్రబాబుకు "కీ" డే

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఈరోజు కీలకం కానుంది. ముఖ్యమైన కేసుల్లో నేడు తీర్పు రానుంది

Update: 2023-10-09 02:37 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఈరోజు కీలకం కానుంది. ముఖ్యమైన కేసుల్లో నేడు తీర్పు రానుంది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి నెల రోజుల నుంచి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు ఈరోజు అనుకూల తీర్పు వస్తుందా? రాదా? అన్న టెన్షన్ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. దాదాపు నెల రోజుల నుంచి చంద్రబాబు జైలు కెళ్లడంతో పార్టీ కార్యక్రమాలు అటకెక్కాయి. ఆయన బయటకు వస్తేనే తప్ప తిరిగి పార్టీలో ఊపు కనపడదు.

ఈ కేసుల్లో...
అందుకే ఈరోజు చంద్రబాబుకు బిగ్ డే గా అని చెప్పాలి. చంద్రబాబు వేసిన క్వాష్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అలాగే విజయవాడ ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబు బెయిల్, కస్టడీకి సంబంధించి పిటీషన్లపై తీర్పు వెలువడనుంది. ఇప్పటికే ఈ రెండు కేసుల్లో వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. సోమవారం ప్రకటిస్తానని తెలియజేశారు.
తీర్పు రిజర్వ్...
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసు మాత్రమే కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు కేసు, ఫైబర్ నెట్ కేసుల్లోనూ చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటీషన్లపై కూడా నేడు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులన్నీ చంద్రబాబుకు అనుకూలంగా వస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటాయి. అదే ప్రతికూలంగా వస్తే మాత్రం మరికొంత వెయిట్ చేయక తప్పదు.


Tags:    

Similar News