విశాఖ ఉక్కుపోరుకు రెండేళ్లు
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ప్రారంభమయిన ఆందోళనలకు నేడు రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి.;
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ప్రారంభమయిన ఆందోళనలకు నేడు రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. గత రెండేళ్ల నుంచి వివిధ రూపాల్లో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించాలని నిర్ణయం తీసుకున్న మరుసటి రోజు నుంచి ఆందోళనలను ప్రారంభించారు. లాభాల బాటలో ఉన్న స్టీల్ ప్లాంట్ ను ఎలా ప్రయివేటీకరిస్తారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
నేడు ప్రజాగర్జన సభ...
ఢిల్లీ వెళ్లి కూడా ఆందోళనలు జరిపారు. బీజేపీ మినహా కార్మికుల ఆందోళనలకు అన్ని పార్టీల, ప్రజాసంఘాల మద్దతు కార్మికుల ఆందోళనలకు లభించింది. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల వైఖరి కన్పించడం లేదు. దీంతో తమ ఆందోళనలకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నేడు విశాఖలో ఉక్కు ప్రజాగర్జన సభను నిర్వహించనున్నారు. ఈ సభకు బీజేపీ మినహా అన్ని పార్టీల ప్రతినిధులు హాజరు కానున్నారు. విశాఖ నగరంలోని తృష్ణా మైదానంలో ఈ సభ జరగనుంది. పోలీసులు ఈ సభ కు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.