సంక్షోభంలో సంక్షేమం... నేటి నినాదం
ఈరోజు సంక్షోభంలో సంక్షేమం నినాదంతో అసెంబ్లీకి టీడీపీ నేతలు నిరసన ప్రదర్శనగా బయలుదేరారు.
తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలు జరిగే ప్రతి రోజూ ఏదో ఒక అంశంపై నిరసన వ్యక్తం చేస్తుంది. ఈరోజు సంక్షోభంలో సంక్షేమం నినాదంతో అసెంబ్లీకి టీడీపీ నేతలు నిరసన ప్రదర్శనగా బయలుదేరారు. నారా లోకేష్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని వారు ఆరోపించారు.
టీడీపీ నిరసన ర్యాలీ...
అన్న క్యాంటిన్లు, పెళ్లికానుక, పండగ కానుకలతో పాటు అంబేద్కర్ విదేశీ విద్యాపథకాలను రద్దు చేయడంపై ఈ నిరసన ప్రదర్శనకు టీడీపీ నేతలు దిగారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్తు బిల్లుల ఆధారంగా పింఛన్లలో కోత పెడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం అమలు చేసిన పథకాల్లో సగం కూడా ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ర్యాలీగా ప్లకార్డులు చేతబూని అసెంబ్లీకి టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లారు.