Tirumala : నేడు తిరుమలలో స్వామి వారికి కళ్లారా చూసుకునే ఛాన్స్

నేడు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భక్తుల సంఖ్య పెద్దగా లేరు.

Update: 2024-10-22 02:52 GMT

నేడు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భక్తుల సంఖ్య పెద్దగా లేరు. మంగళవారం కావడంతో స్వామి దర్శనం సులువుగానే జరుగుతుంది. కంపార్ట్‌మెంట్లలో పెద్దగా వేచి ఉండకుండానే భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. స్వామి వారికి మొక్కులు చెల్లించనున్నారు. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. అనేక కారణాలతో భక్తుల రద్దీ తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఒకవైపు తుపాను హెచ్చరికలు, భారీ వర్షాలతో పాటు దసరా సెలవులు ముగియడం వల్ల కూడా రద్దీ పెద్దగా లేదని అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువ మంది వస్తున్నారని తెలిపారు. ఇక వసతి గృహాలు, అన్న ప్రసాదం వద్ద కూడా పెద్దగా రద్దీ కనిపించడం లేదు. స్వామి వారిని కళ్లారా చూసుకునేందుకు అవకాశం లభిస్తుందని తిరుమలకు వచ్చిన భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో దర్శనం రెండు సార్లు చేసుకునే వారి సంఖ్య కూడా అధికంగా ఉందని చెబుతున్నారు.

ఆరు గంటల సమయం...
తిరుమలలో సాధారణంగా ఎప్పుడూ రద్దీ ఉంటుంది. శుక్ర వారం నుంచి ఆదివారం వరకూ విపరీతమైన భక్తుల రద్దీ ఉంటుంది. బయట వరకూ క్యూ లైన్‌లు ఉంటాయి. గంటల తరబడి స్వామి వారి దర్శనం కోసం వేచి ఉండాల్సి ఉంది. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని రెండు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం టోకెన్ లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,894 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,355 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.82 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.


Tags:    

Similar News