Devaragattu : కర్రలతో కొట్లాట.... పోలీసుల ఆంక్షల మధ్య

నేడు దేవరగట్టు కర్రల సమరం జరుగుతుంది. కర్నూలు జిల్లాలోని హోలగుంద మండలంలోని దేవరగట్టులో ఈ జాతర జరగనుంది

Update: 2023-10-24 04:09 GMT

నేడు దేవరగట్టు కర్రల సమరం జరుగుతుంది. కర్నూలు జిల్లాలోని హోలగుంద మండలంలోని దేవరగట్టులో ఈ జాతర జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు ఆంక్షలు విధించారు. సంప్రదాయంగా వస్తున్న ఈ ఆచారంపై ఆంక్షలేమిటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. దేవరకట్టు కొండపై ఉన్న శ్రీమాల మల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది దసరా పండగ మరుసటి రోజు ఈ కర్రల సమరం జరుగుతుంది. దీనిని బన్నీ ఉత్సవమని కూడా పిలుస్తారు.

నేడు దేవరగట్టు కర్రల సమరం
కానీ ఇది సమరం కాదని, కేవలం సంప్రదాయమేనని గ్రామస్థులు చెబుతారు. పోలీసుల ఆంక్షలు పనిచేయవని వారు అంటున్నారు. ఈ బన్నీ ఉత్సవంలో తండా, నెరణికి, కొత్తపేట గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొంటారు. కర్రలకు ఇనుప చువ్వలు కట్టి మరీ కొట్టుకుంటారు. ఈ సమరంలో తలలు పగులతాయి. అనేక మంది గాయాలపాలవుతారు. ప్రభుత్వం కొన్నేళ్ల నుంచి అక్కడికక్కడే ప్రాధమిక వైద్య సేవ సదుపాయాలను కల్పిస్తున్నా కొందరు మాత్రం తీవ్రంగా గాయపడుతుండటంతో పోలీసులు ఆంక్షలు విధించారు. దేవరగట్టు కర్రల సమరం సందర్భంగా పోలీసులు ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. రెండువేల మంది పహారా కాస్తున్నారు. వంద పడకల తాత్కాలిక ఆసుపత్రిని కూడా అక్కడ ఏర్పాటు చేయడం విశేషం.


Tags:    

Similar News