Breaking : వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టు ఏమందంటే?

వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించింది.

Update: 2024-07-04 06:31 GMT

వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించింది. చట్ట ప్రకారమే వ్యవహరించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా నిర్ణయాలు తీసుకోకూడదని తెలిపింది. రెండు నెలల్లోగా భవన నిర్మాణాలక అనుమతులు అధికారులకు సమర్పించాలని తెలిపింది. వైసీపీ వాదనలను వినపించేందుకు రెండు అవకాశం ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. . ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల్లోని ప్రతిపక్ష వైసీపీ కార్యాలయాలను కూల్చివేతకు అధికారులు సిద్ధమయ్యారు.

నిబంధనలకు విరుద్ధంగా...
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగాయని వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులకు నోటీసులు అందచేశారు. దీంతో వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లో ఉన్న వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై విచారించిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండునెలల్లోగా అనుమతులు అధికారులకు సమర్పించాలని తెలపడం కొంత వరకూ ఊరటకలిగించే అంశమేనని ఆ పార్టీ నేతలు చెబుతున్ారు.


Tags:    

Similar News