రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల
నేడు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు
రేపటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. చాలా రోజుల తర్వాత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేస్తుంది. కోవిడ్ తీవ్రత దృష్ట్యా సర్వదర్శనం టోకెన్లను టీటీడీ నిలిపి వేసింది. అయితే ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరిగి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించింది.
రోజుకు పదివేలు...
ఈ టిక్కెట్లను ఈరోజు నుంచి తిరిగ ిప్రారంభిస్తారు. రేపటి దర్శనం కోసం ఈరోజు టిక్కెట్లను ఇస్తారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజ స్వామి కాంప్లెక్స్ లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ సర్వదర్శనం టోకెన్లను పొందవచ్చు. రోజుకు పది వేల చొప్పున టిక్కెట్లను కేటాయించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది.