Tomato : లక్షాధికారులవుతున్న కర్నూలు, చిత్తూరు టమాటా రైతులు.. రాత్రికి రాత్రి జీవితం మారిపోయిందిగా

మదనపల్లె, కర్నూలు ప్రాంతాల్లో టమాటా రైతులు ఒక్కసారిగా లక్షాధికారులుగా మారిపోతున్నారు.

Update: 2024-06-19 12:08 GMT

మదనపల్లె, కర్నూలు ప్రాంతాల్లో టమాటా రైతులు ఒక్కసారిగా లక్షాధికారులుగా మారిపోతున్నారు. దేశమంతటా టమాటా దిగుబడులు తగ్గిపోవడంతో ఊహించని ఆదాయం వస్తుంది. ముఖ్యంగా కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో రైతులు తాము పెట్టుబడి పెట్టిన దానికంటే కొన్ని రెట్లు అధికంగా లాభాలను ఆర్జిస్తున్నారు. సాధారణంగా ఈ ధరలు ఎండాకాలంలో వస్తాయంటారు. అప్పుడు వర్షాలు లేక గిట్టుబాటు ధరలు లభించవు. కిలో టమాటా యాభై పైసలకు కూడా అమ్ముడుపోయిన రోజులున్నాయని రైతులు గుర్తుకు చేసుకుంటున్నారు. అయితే వర్షాకాలంలో ఈ తరహా ధర పలుకుతుందని తాము ఊహించలేదని రైతులు చెబుతున్నారు.

బౌన్సర్లను నియమించుకుని...
గత సీజన్ లో దేశంలో టమాటాకు డిమాండ్ పెరగడంతో పొలాల వద్ద ప్రయివేటు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు రైతులు. అలాగే బౌన్సర్లను కూడా టమాటాను విక్రయించుకునేందుకు నియమించుకున్న సంగతిని చూశాం. అలాగే గత సీజన్ లో టమాటా వల్ల కోటీశ్వరులయిన వారు దేశంలో అనేక మంది రైతులున్నారు. టమాటాకు హై సెక్యూరిటీని కూడా పెట్టుకున్నారు. టమాటాను మార్కెట్ కు తీసుకవచ్చే వాహనాలను కూడా లూటీ చేశారు. దీనికి తోడు టమాటా వ్యాపారులు తమ దుకాణాల వద్ద సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకున్న ఘటనలు చూశాం. కానీ అవే సీన్లు మళ్లీ ఇప్పుడు రిపీట్ అవుతున్నాయని చెప్పాలి.
పెరిగిన డిమాండ్ తో...
టమాటా ధరలు పెరగడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. నేరుగా పొలాల వద్దకు వచ్చి వ్యాపారులు కొనుగోలు చేసే పరిస్థితి ఉందని కర్నూలు జిల్లాకు చెందిన రైతు ఒకరు చెప్పారు. పత్తికొండ మార్కెట్ లో కిలో టమాటా ధర వంద రూపాయల నుంచి 120 రూపాయలకు చేరుకుంది. రెండు ఎకరాల్లో టమాటా పంట వేద్దాం చాలులే అనుకున్న వాళ్లు పెరిగిన ధరలు చూసి ఇప్పుడు బాధపడుతున్నారు. చేతికి వచ్చిన పంట వెంటనే కొనుగోలు చేస్తుండటంతో రైతుల ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. మదనపల్లి, పత్తికొండ మార్కెట్ నుంచి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడానికి వ్యాపారులు ఎక్కువ మొత్తం ఇచ్చి కొనుగోలు చేస్తుండటంతో రాత్రికి రాత్రి లక్షాధికారులుగా మారిపోయారు. ఇప్పడు వేసిన పంట సెప్టంబరు, అక్టోబరు వరకూ చేతికి రాదు. అప్పటి వరకూ టమాటా రేటు ఇంకా పెరగడమే తప్ప తగ్గదంటున్నారు.


Tags:    

Similar News