దారుణంగా పడిపోయిన టమాటా ధర

టమాటా మార్కెట్ మళ్లీ పడిపోయింది. ఒక్కసారిగా టమాటా ధర పడిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు

Update: 2022-02-05 02:51 GMT

టమాటా మార్కెట్ మళ్లీ పడిపోయింది. ఒక్కసారిగా టమాటా ధర పడిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మదనపల్లి టమాటా మార్కెట్ లో కిలో ఐదు రూపాయలుకు పడిపోయింది. ఐదు రూపాయలకు కూడా కొనే పరిస్థితి లేదు. కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మదనపల్లి మార్కెట్ లో కిలో టమాటా రెండు రూపాయలకు కూడా పలుకుతుండటంతో రైతులు కొందరు పంటను అక్కడే పారబోసి వెళుతున్నారు.

బయట మార్కెట్ లో...
దీనికి ప్రధాన కారణం పంట దిగుబడి ఎక్కువగా రావడమే. ఇతర రాష్ట్రాల నుంచి టమాటా వస్తుండటంతో ధర పూర్తిగా పడిపోయిందని రైతులు వాపోతున్నారు. నెల క్రితం కిలో టామాటా ధర రూ.150 లు పలికింది. టమాటా రైతు అదృష్టవంతుడన్నారు. అదే టమాటా ఇప్పుడు ఐదు రూపాయలకు కూడా కొనే పరిస్థితి లేదు. దీంతో రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బయట మార్కెట్ లో మాత్రం కిలో టమాటా ఇరవై రూపాయలు పలుకుతుంది.


Tags:    

Similar News