టమాటాలను రోడ్లపై పారేస్తున్నారు

కొద్దిరోజుల కిందట వందల్లో పలికిన టమాటా ధరలు ఇప్పుడు దారుణంగా పడిపోయాయి

Update: 2023-09-07 11:47 GMT

కొద్దిరోజుల కిందట వందల్లో పలికిన టమాటా ధరలు ఇప్పుడు దారుణంగా పడిపోయాయి. 5 రూపాయలకు కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. టమాటాకు ధరలు లేక రైతులు రోడ్ల మీద పారబోస్తున్నారు. నంద్యాల జిల్లా ప్యాపిలి టమాటా మార్కెట్‌లో ధరలు లేకపోవడంతో రైతులు టమాటాను అక్కడే పారబోసి వెళ్లిపోయారు. ధర బాగా తగ్గడంతో కనీసం ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు అన్ని మార్కెట్‌లలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కిలో టమాటా ప్యాపిలిలో 3 పలుకుతోంది. మదనపల్లి మార్కెట్‌లోను ధరలు దారుణంగా పడిపోయాయి.ధరలు భారీగా తగ్గిపోయాయని, దీని వల్ల కోత, రవాణా ఖర్చులు సైతం రావటం లేదని రైతులు వాపోతున్నారు. ఏపీలోని అన్ని మార్కెట్లలో ఇదే పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొద్దిరోజుల కిందట 150 రూపాయలను దాటిన టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టమాటా పంటలు చేతికందడంతో రేటు దారుణంగా పడిపోయింది. అంత తక్కువ ధరకు గిట్టుబాటు కాదని రైతులు మార్కెట్ కు తెచ్చిన టమోటాలను అమ్మ లేక, తిరిగి తీసుకెళ్లలేక కింద పడవేసి వెళ్తున్నారు.


Tags:    

Similar News